29-09-2025 06:06:48 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపల్ కమిషనర్ గా టీ.శ్రీనివాసరావు నియమితులయ్యారు. నూతనంగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీకీ ఇప్పటివరకు ఇన్చార్జిలతోనే కాలం నెట్టుకొచ్చారు. రెగ్యులర్ కమిషనర్ గా సిరిసిల్ల నుండి బదిలీపై వచ్చిన నూతన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు.