29-09-2025 07:36:04 PM
హైదరాబాద్: సాగునీటి వినియోగదారుల సంఘాల(Irrigation water users association) అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Irrigation Minister Uttam Kumar Reddy) పేర్కొన్నారు. సాగునీటి సంఘాలతో చెరువులు, కాలువలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నిర్ణయించారని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల తర్వాత సాగునీటి వినియోగదారుల సంఘాల ఏర్పాటు చేసి మొదట చెరువులతో ప్రారంభించి పెద్ద ప్రాజెక్టుల వరకు విస్తరిస్తామని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ప్రతి సంఘానికి నీటిపారుదలశాఖ నుంచి ఒక అధికారి కన్వీనర్ గా ఉంటారని, రైతు సంక్షేమ కమిషన్(Farmers Welfare Commission) ఛైర్మన్, సభ్యులతో చర్చించాక సంఘాలు ఏర్పాటు చేస్తామన్నారు.
నీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటు చేయాలని గతంలో కోదండరెడ్డి కోరారని, ఆల్మట్టి ఎత్తు పెంచాలన్న కర్ణాటక నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాదించాలని మంత్రి చెప్పారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదని, తుమ్మిడిహట్టి ఆనకట్ట కోసం సవరణలతో డీపీఆర్ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. కేబినెట్ ఆమోదం తర్వాత ఎస్ఎల్బీసీ సొరంగం(SLBC Tunnel) పనులు చేపడతామని, చిన్న కాళేశ్వరం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(Kalvakurthi Lift Irrigation Scheme)పై, దేవాదుల ఆరో ప్యాకేజీ సవరించిన అంచనాలపై త్వరగా కేబినెట్ పరిశీలనకు చర్యలు తీసకుంటుందని మంత్రి ఉత్తమ్ ధీమ వ్యక్తం చేశారు.