29-09-2025 07:24:01 PM
సమావేశంకు 500 మంది అయ్యప్ప భక్తులు...
బాన్సువాడ (విజయక్రాంతి): అనంతపురంలో అఖిల భారత అయ్యప్పచిన్ముద్ర సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈశ్వరయ్యా పరివేక్షణలో మొదటి జాతీయ, రాష్ట్ర కార్యవర్గ నియామకం కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించడం జరిగింది. ABA చిన్ముద్ర సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 4 రాష్ట్రల సభ్యులతో సమావేశం నిర్వహించడం, ట్రస్ట్ యొక్క కార్యాచరణ విధాన సిద్ధాంతల గురించి ప్రతిఒక్కరికి తెలిసేలా రాష్ట్రల, జిల్లాల వారిగా సభ్యుల ముందుకు రావాలని ఇంకా మునుముందు అనే ప్రాంతంలో ABA చిన్ముద్ర సేవా ట్రస్ట్ నూతన కమిటీల ఏర్పాటు దిశగా ముందుకు వెళ్ళాలి అనీ ట్రస్ట్ ద్వారా చేయవాల్సిన పలు సేవా కార్యక్రమల గురించి చెప్పడం జరిగింది. అయ్యప్ప సేవలో ముందుండే వారిని అందర్ని అఖిల భారత అయ్యప్పచిన్ముద్ర సేవా ట్రస్ట్ ద్వారా ఏకం చేయాలని ప్రతి ఒక్కరికి సేవాలో, ట్రస్ట్ లో అవకాశం అందించే విధంగా ప్రతి సభ్యుడు కృషి చేయాలని చెప్పారు.
అనంతరం ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో 4 రాష్ట్రల జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యుల నియామకం జరిగింది. జాతీయ అధ్యక్షులుగా అది నారాయణ, జాతీయ కార్యదర్శిగా తీగుల్లా కుమార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఇనుగుల యుగేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా బండి రాంచందర్, జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సీతలే రమేష్, తెలంగాణ జాయింట్ సెక్రటరీగా గుడికొండ సుభాష్, తెలంగాణ జోనల్ సెక్రెటరీగా కొర్రి సుధాకర్ యాదవ్, తెలంగాణ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇరుపరాజు, కమిటీ సభ్యులుగా నియామకం చేశారు. ఇట్టి కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు అది మోహన్ రెడ్డి, రుద్ర కోటేశ్వరావు, సిరిసేటి రాజేష్ గౌడ్, కర్క సిద్దు, బ్యాళ్ల ఈశ్వరయ్య, డ్రా. బాలు లెంకల, ఆనంత రావు, వైకుంఠం, కమిటీ సభ్యులు అయ్యప్ప భక్తులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.