calender_icon.png 17 October, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శతాధిక వృద్ధురాలు బుచ్చమ్మ మృతి

17-10-2025 12:00:00 AM

మెడికల్ కళాశాలకు పార్థివ దేహం అప్పగింత 

మహబూబాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన  పెండెం బుచ్చమ్మ (105) బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అయితే బుచ్చమ్మ తన మరణం తర్వాత పార్టీవ దేహానికి అంత్యక్రియ నిర్వహించకుండా మెడికల్ కళాశాలకు అందజేయాలని నిర్ణయించి ఆమోదపత్రం అందజేసింది.

ఆమె నిర్ణయం మేరకు గురువారం మహబూబాబాద్ జిల్లా మెడికల్ కళాశాలకు బుచ్చమ్మ పార్థివ దేహాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందజేశారు.  లయన్స్ క్లబ్ అద్యక్షులు డాక్టర్ బి. వీరన్న జోన్ చైర్మన్ మాధవపెద్ది వెంకట్ రెడ్డి, డిస్ట్రిక్ట్ బాద్యులు అనుమాల వెంకటేశ్వర్లు  బుచ్చమ్మ మేనల్లుడు,  సీని యర్ పాత్రికేయుడు గుంటి సురేష్, లయన్స్ క్లబ్ సెక్రటరీ పరకాల రవీందర్ రెడ్డి  మెడికల్ కాలేజీ అనాటమీ ప్రొఫెసర్ డాక్టర్ భరత్ కుమార్, నేత్ర, శరీర,

అవయవ దాతల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరికి పండ్ల అశోక్, టీయూడబ్ల్యూజె జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్,   సంగెం వీరన్న, ఎర్ర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన బుచ్చమ్మ వైద్య విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తన పార్థివ దేహాన్ని అప్పగించేందుకు అంగీకరించడం గొప్ప విషయ మని పలువురు పేర్కొన్నారు.