calender_icon.png 17 October, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీఓఏల వ్యక్తిగత ఖాతాలో వేతనాలు జమ చేయాలి

17-10-2025 12:00:00 AM

మహబూబాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : ఐకేపీ విఓఏ లకు కనీస వేతనాలు అమలు చేస్తూ, వేతనాలను విఓఏల వ్యక్తిగత ఖాతాలో జమ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జగన్నాధం భవనంలో సిఐటియు ఆధ్వర్యంలో తెలంగాణ ఐకేపీ విఓఏ ఉద్యోగుల సంఘం జిల్లా మహాసభ జరిగింది. 

అనంతరం ఐకేపీ విఓఏ నూతన జిల్లా కమిటీని 17 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా నీలం కృష్ణవేణి, ప్రధాన కార్యదర్శిగా చింతా మౌనిక, కోశాధికారిగా గుగులోత్ హన్మంతు ఎన్నికైనారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజు, పట్టణ కార్యదర్శి కుమ్మరికుంట్ల నాగన్న, ఐకేపీ విఓఏ యూనియన్ జిల్లా నాయకులు  సుధాకర్, శోభారాణీ, రమ, చంద్రకళ, లలిత, అనిత, పవన్, ఇందిర, అశోక్ పాల్గొన్నారు.