06-08-2025 04:56:18 PM
విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు..
నల్గొండ క్రైం: సైబర్ నేరాల్లో ఎక్కువగా విద్యావంతులే మోసపోతున్నారని సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీనారాయణ(Cyber Crime DSP Lakshminarayana) అన్నారు. సైబర్ జాగారుకత దివాస్ సందర్భంగా బుధవారం నల్లగొండ పట్టణం పోలీసు ఆడిటోరియంలో పలు కళాశాల విద్యార్థులకు సైబర్ నేరాలకు గురై మోసపోకుండా జాగ్రత్త పడే విషయమై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలన్నారు. డబ్బుల పోయాక బాధపడటం కంటే అవగాహనతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. చదువుకున్న విద్యార్దులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉంటే కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు.
అవగాహనతోనే సైబర్ మోసాలు నిరోధించవచ్చునని, సైబర్ నేరగాళ్లు ప్రజలనూ మోసం చేస్తున్న విధానాన్ని విద్యార్థులు ఇతరులకు తెలియజేయాలన్నారు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న నేరాలు అయిన పీఎం కిసాన్ యోజన అంటూ ఏపీకే ఫైల్స్ వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తున్నారని, ఈ ఏపీకకే ఫైల్ ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ కు గురి అయి డబ్బులు పోయే అవకాశం ఉంటుంది, అలాగే జంప్డ్ డిపాజిట్ స్కీం, డిజిటల్ అరెస్టు, ఇన్వెస్ట్మెంట్ ప్రౌడ్, సైబర్ బుల్లింగ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. మన ఆశ, అత్యాశ లే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి అని, డబ్బులు ఎవ్వరు ఉరికే ఇవ్వరు అనే విషయాన్నీ ప్రజలు గ్రహించాలని కోరారు. బ్యాంక్ అదికారులు ఎవరు కూడా ఫోన్ చేసి ఓటీపీ వివరాలు అడగరు అనే విషయాలను గుర్తించాలని ,బ్యాంక్ వారు ఏలాంటి మెసేజ్ లు గాని, లింక్స్ పంపరని ఇట్టి విషయాలు యువత కుటుంబ సభ్యులకు తెలియజేయాలని, ఏమైన సందేహాలు ఉంటే బ్యాంక్ కు వెళ్లి నిర్ధారించుకోవాలి విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అంటూ ఏదైనా ప్రభుత్వ శాఖ వారు అని ఫోన్ చేసి ఓటీపీ వివరాలు అడిగితే చెప్పవద్దు ఆని,అలాంటి వారు ఓటీపి అడుగరనే విషయన్ని గ్రహించాలని అన్నారు. ప్రజలు ,గ్రూప్ లలో లేదా వ్యక్తిగత నెంబర్ లకు అపరిచిత వ్యక్తుల నుండి ఎస్ ఎమ్ ఎస్ ఈ మెయిల్స్ ద్వారా గాని, వాట్సాప్ ట్యీట్టర్ ద్వారా వచ్చే బ్లూ కలర్ లింక్స్ ను క్లిక్ చేసి మోసపోవద్దని, అలా వచ్చే మెసేజ్ లకు స్పందించవద్దు అని చిన్న చిన్న తప్పిదాలతో తాము కష్ట పడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైన వెంటనే స్పందించి 1930కి సమాచారం అందించి ఎన్సిఆర్పి పోర్టల్ (www.cybercrime.gov.in)లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారుని,పోయిన డబ్బులు రికవరీ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి సైబర్ క్రైమ్ ఎస్.ఐ విష్ణు,,2 టౌన్ ఎస్.ఐ సైదులు, సైబర్ క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ రియాజ్, కళాశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.