06-08-2025 04:52:08 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా గ్రామీణ బస్టాండ్ వద్ద బుధవారం జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో అక్కపల్లి లక్ష్మయ్య ద్వితీయ వర్ధంతి సందర్భంగా 352 వ సారి నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల సహకారంతో జనహిత ఆధ్వర్యంలో పేదల ఆకలి తీర్చడం ఆనందంగా ఉందని అధ్యక్షులు ఆడెపు సతీష్ ఆనందం వ్యక్తం చేశారు. అన్నదాన కార్యక్రమాలు విజయవంతానికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ఉపాధ్యక్షులు కందుల రాజన్న, కోశాధికారి గిరి ప్రసాద్, కార్యవర్గ సభ్యులు కనకయ్య, గురు స్వామి పాల్గొన్నారు.