calender_icon.png 18 August, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

18-08-2025 02:31:15 AM

  1. పెన్షన్ పెంచకుండా దివ్యాలాంగులను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
  2. పెన్షన్ పెంచే వరకు ఉద్యమం
  3. ఎన్ పి ఆర్ డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య

నర్వ, ఆగస్టు 17 : దివ్యాంగులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమ లు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య ఆరోపించారు. విక లాంగుల హక్కుల కార్యదర్శి కాశప్ప అధ్యక్షతన ఆదివారం జరిగిన కార్యక్రమానికి   ము ఖ్య అతిథిగా హాజరై యం అడివయ్య మాట్లాడుతూ 2014 ఎన్నికల కంటే ముం దు వికలాంగుల సంక్షేమనికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన మోడీ ప్రభుత్వం ఎందుకు అ మలు చేయడం లేదన్నారు. 11ఏండ్లలో వికలాంగులలో పేదరికం, నిరుద్యోగం,

ఆకలి చావులు పెరిగిపోయినాయనిఆయన ఆవేదన వ్యక్తం చేశారు.2020 లో విధించిన లా క్ డౌన్ వికలాంగుల జీవితాలను తీవ్ర ప్రభా వం చూపిందని అన్నారు. వికలాంగుల కోస మే ఉన్నామని గొప్పలు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం 11ఏండ్లలో వికలాంగులకుఏమి చేసిందో ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్న వికలాంగులలో సగం మందికి కూడా యూ డి ఐ డి కారడ్స్ రాలేదని అన్నారు. పోరాటాలతో సాధించిన 2016 ఆర్పి డబుల్ డి చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి మోడీ ప్రభు త్వం కుట్రలు చేస్తుందని అన్నారు.

వికలాంగుల కోసం స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చే యాలని డిమాండ్ చేశారు.వికలాంగులు న్యాయభద్ధమైన వివక్షత చట్టంలో పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వికలాంగుల కోసం అమలు అవుతున్న కేం ద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల కోత పెడుతున్నారని అన్నారు. సుగమ్య భరత్ అభియాన్ పథకం మోడీ ప్రచారం కోసమే తప్ప వికలాంగుల కోసం కాదని అన్నారు. అమృత్ భరత్ రైల్వే స్టేషన్లో ఎందుకు అవరోధ రహి త వాతావరణం లేదని అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 2020 నూతన వి ద్యా పథకం వికలాంగులను చదువులకు దూరం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వికలాంగులలో 65 శాతం మందికి ఉపాధి లేదని అన్నారు 2012 నుండి ఇందిరా గాంధీ నేషనల్ వికలాంగుల పెన్షన్ 300 రూపాయలే ఇస్తున్నారని ధరల పెరుగుదల సూచికి అనుగుణంగా పెన్షన్ ఎందుకు పెంచడం లేద న్నారు. ఎలాంటి షరతులు లేకుండా ఇంది రా గాంధీ నేషనల్ వికలాంగుల పెన్షన్ అ మలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకంలో వికలాంగులకు జాబ్ కార డ్స్ ఇవ్వకుండా ప్రభుత్వం చూస్తుందని అ న్నారు .

2016 ఆర్ పి డబ్ల్యు చట్టం, నేషనల్ ట్రస్ట్, లకు చైర్మన్లను ఎందుకు నియమించడం లేదని అన్నారు. రెహబిలిటేషన్ కౌన్సి ల్ అఫ్ ఇండియా చట్టానికి చైర్మన్ నియమించకుండా ఎందు కు కాలయాపన చేస్తు న్నారని అన్నారు దేశవ్యాప్తంగా ఉన్న 9 నేషనల్ ఇన్స్టిట్యూట్ లను విలీనం చేయాలనే ఆలోచనను విరామించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు వికలాంగులకు చేస్తున్న మోసలపై ఉద్యమం చెస్తామని హేచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అ ధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్న పెన్షన్ ఎందుకు పెంచడం లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభు త్వం వికలాంగులను మోసం చేస్తుందని అ న్నారు. పెన్షన్ పెంచే వరకు ఉద్యమం చేస్తామని హేచ్చరించారు.ఎన్ పి ఆర్ డి కార్య దర్శి కె కాషాప్ప మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వికలాంగుల కార్పొరేషన్ను బలోపేతం చే సేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పెండింగ్ పెన్షన్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 2016 ఆర్పి డబుల్ డి చట్ట ప్రకారం జిల్లా, రాష్ట్ర స్థాయిలో కో ఆర్డినేషన్ కమిటీలను ఏ ర్పాటు చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. జిల్లాలో వికలాంగుల సమస్య లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. దరఖాస్తూ చేసిన వారికి పరికరాలు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అన్నా రు.

ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి పి బాబు, ఉపాధ్యక్షులు రంగయ్య, మల్లప్ప,న ర్సప్ప, కృష్ణ, సహాయ కార్యదర్శులు బాలరాజు, బస్వరాజు, పెంటయ్య జిల్లా కమిటీ సభ్యులు మల్లేష్, గోవింద్, మల్లేష్, చంద్రశేఖర్, సాయబన్న, హన్మంత్ తదితరులు పాల్గొన్నారు.