18-08-2025 01:35:53 AM
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు
హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): రాష్ట్రాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకుపోవాలంటే వేగవంతమైన మార్పులతోనే సాధ్యమని ప్రభు త్వం భావిస్తోంది. అందుకే కీలకమైన ప్రాజెక్టులను తీసుకు వచ్చేందుకు కృషి చేస్తోంది. రాష్ట్రంలో సముద్రం లేకపోవడంతో సముద్ర రవాణాకు అవకాశం లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో రాజధాని సమీపంలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మిం చి ఏపీలోని బందర్ పోర్టు నుంచి సరు కు రవాణాను వేగవంతంగా చేస్తే రాష్ట్రాభివృద్ధిలో గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. అందు కే ఈ ప్రాజెక్టులపై కేంద్రానికి ఆయన అనేకసార్లు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ఈ ప్రాజెక్టులను మంజూరు చేసేందుకు సిద్ధమవు తున్నట్లు సమాచారం. డ్రైపోర్ట్, అక్కడి నుంచి బందర్‌కు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రారంభమైతే రాష్ట్రాభివృద్ధికి ఈ రెండు ప్రాజెక్టులు ఎంతో కీలకంగా మారనున్నాయి.
సరుకు రవాణాకు కీలకం
రాష్ర్ట ప్రభుత్వం రవాణా ఆధారిత అభివృద్ధిపై కీలక ఆలోచన చేస్తోంది. నూతన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, ప్రత్యేక రైలు మార్గం, డ్రైపోర్ట్ నిర్మాణంతో ఎగుమతులు, దిగుమతులను సులభతరం చేయవచ్చని సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ సమీపంలోని ఫోర్త్ సిటీ నుంచి ఏపీలోని అమరావతికి, అక్కడి నుంచి బందర్ పోర్టుకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలని భావించి ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
హైదరాబాద్ శివారులో నిర్మించాలని భావిస్తున్న డ్రైపోర్టు నుంచి మచిలీపట్నం పోర్టు వరకు కొత్త రైలు మార్గానికి ప్రయత్నిస్తోంది. ఇందుకు ఏపీ సర్కారు కూడా అనుకూలంగానే ఉంది. ఇప్పటికే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే డీపీఆర్ రూపొందించేందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ (మోర్త్)కు కేంద్రం సూచనలు కూడా చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ 65వ నంబరు జాతీయ రహదారికి ప్రత్యమ్నాయంగా గ్రీన్‌ఫీల్డ్ హైవే హైదరాబాద్ నుంచి కాకుండా హైదరాబాద్ ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేసే ఫోర్త్ సిటీ నుంచి చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఎన్‌హెచ్‌కు సుమారు 10 కి.మీ దూరంలో సమాంతరంగా నిర్మించబోయే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేతో ప్రత్యేక కారిడార్ రూపొందించేందుకు ఆస్కారం లభిస్తుందని భావిస్తున్నారు. రెండు రహదారుల మధ్యలోని ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
తీరనున్న తీర ప్రాంత ఇబ్బందులు
రాష్ర్టంలో తీర ప్రాంతం లేకపోవడంతో నౌకాశ్రయాలకు అవకాశం లేదు. దీంతో బియ్యం, సిమెంటు, చమురు, ఎరువుల ఎగుమతులు, దిగుమతులకు వ్యయప్రయాసలు ఎదురవుతున్నాయి. అమరావతికి నూతనంగా నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు హైదరాబాద్ శివారులో ఏర్పాటు చేసే జంక్షన్ వద్ద డ్రైపోర్టు ఏర్పాటు చేయాలని రాష్ర్ట ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్లు సమాచారం.
ఆ డ్రైపోర్టు నుంచి మచిలీపట్నం నౌకాశ్రయం వరకు కొత్త రైలు మార్గం నిర్మించేందుకు కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి కూడా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నౌకాశ్రయం తరహాలో డ్రైపోర్టులో కంటైనర్ యార్డులు, కార్గో నిర్వహణ వంటి కార్యకలాపాలు జరగనున్నాయి. కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు సమీపం నుంచి మచిలీపట్నం డ్రైపోర్టు-కు నూతన రైలు మార్గం ఉండేలా సర్కారు ఆలోచనగా ఉంది.
లాజిస్టిక్స్ వ్యవస్థను మెరుగుపర్చేందుకు డ్రైపోర్ట్
డ్రై పోర్ట్ (ఇన్లాండ్ కంటైనర్ డిపో) అనేది సముద్రతీరాలకు దూరంగా ఉండే ఒక లాజిస్టిక్స్ కేంద్రం. ఇది రోడ్డు, రైలు మార్గాల ద్వా రా సముద్ర ఓడరేవులతో అనుసంధానించబడి ఉంటుంది. ఈ పోర్టులు సరుకు రవాణాను సులభతరం చేయడంలో, ఖర్చులను తగ్గించడంలో, లాజిస్టిక్స్ వ్యవస్థను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. డ్రై పో ర్టులు సముద్ర ఓడరేవుల వద్ద జరిగే సరుకు నిర్వహణ, కస్టమ్స్ క్లియరెన్స్ వంటి కార్యకలాపాలను డ్రైపోర్టుకు బదిలీ చేస్తాయి. దీని వల్ల ఓడరేవుల వద్ద రద్దీ తగ్గుతుంది, ఓడలు వేగంగా తమ కార్యకలాపాలను పూర్తి చేసుకుని బయలుదేరడానికి వీలవుతుంది.
డ్రైపోర్టుతో అంతర్జాతీయ మార్కెట్‌కు కనెక్టింగ్
సరుకులను నేరుగా ఓడరేవుల నుంచి తరలించడం కంటే డ్రైపోర్ట్ ద్వారా రవాణా చేయడం ద్వారా ఖర్చు, సమయం ఆదా అవుతుంది. డ్రైపోర్టులో కంటైనర్‌లను రైలు లేదా రోడ్డు మార్గాల ద్వారా ఒకేసారి పెద్దమొత్తంలో తరలించవచ్చు. డ్రైపోర్టులు వివి ధ రవాణా మార్గాల (రోడ్డు, రైలు, సము ద్రం) మధ్య సమన్వయాన్ని పెంచుతాయి. ఇది సరుకు రవాణాను మరింత సులభత రం చేస్తుంది.
సముద్రం లేని అంతర్గత ప్రాం తాలు కూడా అంతర్జాతీయ మార్కెట్‌కు సులభంగా అనుసంధానం కావడానికి డ్రై పోర్టులు సహాయపడతాయి. డ్రైపోర్టులు పా రిశ్రామిక కేంద్రాలకు దగ్గరగా ఏర్పాటు చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తా యి. దీనివల్ల లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, రవా ణా వంటి రంగాలు వృద్ధి చెందుతాయి. ఉదాహరణకు నాగ్‌పూర్ డ్రైపోర్ట్ మధ్య భారతదేశంలో లాజిస్టిక్స్ రంగాన్ని అభివృద్ధి చేసింది.
బీహార్‌లో డ్రైపోర్ట్ ఏర్పాటు విజయవంతం కావడంతో ఆ రాష్ర్ట ఆర్థిక వ్యవస్థకు అనేక ప్రయోజనాలు చేకూరాయి. హైదరాబాద్ నుంచి బందర్‌కు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ద్వారా వేగవంతమైన ప్రయాణ మార్గాన్ని ఏ ర్పాటు చేయడం ద్వారా ఇక్కడ కూడా విజ యం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు.