calender_icon.png 18 August, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్రూం ఇండ్ల పంపకం ఎప్పుడో..?

18-08-2025 02:33:19 AM

  1. పనులు పూర్తయిన పంపకం ఆగితే ఎట్లా..

నిరుపేదలు ఎదురుచూస్తున్న ఇవ్వని ఇండ్లు

అర్హులను ఎంపిక చేసి వెంటనే ఇవ్వాలని లబ్ధిదారుల ఆవేదన

నవాబు పేట ఆగస్టు 17 : డబల్ బెడ్ రూ మ్ ఇండ్లను మూడేళ్ల క్రితం నిర్మించినా పం పిణీ చేయడంలో జాప్యం జరుగుతోంది. కట్టిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని ఉన్న ఇండ్లలో వర్షపు దాటికి కూలి పోతున్నాయంటూ కొంతమంది లబ్ధిదారు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరి దశలో చిన్న చిన్న పనులు ఉన్న వెంటనే చేయించి లబ్ధిదారులకు అందిస్తే ఎంతో మేలు జరుగుతుంది.

ప్రజా పాలన ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి దాదాపు 18 నెలలు గడుస్తున్నప్పటికీ నిర్మించిన ఇండ్లు ఎందుకు ఇవ్వ డం లేదంటూ లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. నెలలు తరబడి నిర్మించిన ఇండ్ల కోసం ఎదు రు చూడటం ఏంటని, ప్రజల కోసమే నిర్మించిన డబుల్ ఇండ్లను పంపిణీ చేస్తే తప్పే ముందంటూ అనేక ప్రశ్నలు ఊపొందుకుంటున్నాయి.

ప్రజా ప్రతినిధులు ఈ విష యంపై ప్రత్యేక దృష్టి సారించి నిర్మించిన ఇండ్లను పంపిణీ చేయడంతో పాటు ఇందిర మ్మ ఇండ్లను నిర్మిస్తున్న వారికి ప్రోత్సహిస్తూ ముందుకు సాగితే మరింత నిర్మించి వదిలేస్తే... ఉపయోగం ఏంటి..

గత ప్రభుత్వము మండలంలో మూడు ప్రాంతాలలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ని ర్మించింది. నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అందిస్తామని గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆశించిన స్థాయిలో నిర్మించకపో యినా నిర్మించిన వాటిని కూడా చివరి దశ లో లబ్ధిదారులకు ఇవ్వకుండా బిఆర్‌ఎస్ ప్ర భుత్వం అధికారంలోకి రాకపోవడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మించిన ఇండ్లను ఇస్తే అర్హులైన వారు యాదేచ్ఛంగా ఇంట్లో ఉండేందు కు అవకాశం ఉంటుందని, ఇండ్లు లేక కురుస్తున్న వర్షాలతో తెగ ఇబ్బందులకు గురవు తున్నామని కన్నీళ్లు పెట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. అధికారులే ఇండ్లు కూలిపోయిన వారికి జిల్లాలోని పలు ప్రాంతాలలో ఇతరుల ఇండ్లను అడిగి ఇప్పియ్యడంతో పాటు ప్రభుత్వ భవనాలలోనూ ఆశ్రయం కల్పిస్తున్న దాఖలాలు లేకపోలేదు. ఇప్పటికైనా నిర్మించిన ఇండ్లను ఇవ్వాలని ప్రజల నుంచి భారీ ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. 

నిర్మాణం ఇలా....

మండలంలో మూడు గ్రామాలలో ఇండ్లు నేర్పించినప్పటికీ రుద్రారం గ్రామం లో మాత్రం ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. యన్మంగండ్ల,తీగలపల్లి గ్రామంలో నిర్మించిన ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారు. మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో మాత్రమే ఇండ్లను పంపిణీ చేయడం మిగతా తీగలపల్లి, యన్మంగండ్ల గ్రామాలలో ఉన్న ఇండ్లను పంపిణీకి నోచుకోలేదు.

అందుబాటులో ఇండ్లు నిర్మించి ఉన్నప్పటికీ ఇవ్వకపోవడంతో నిరుపేదలకు అందని ద్రాక్షగా నిలిచిపోయాయి. గత ప్రభుత్వం చేపట్టిన పథకంలో భాగంగా యన్మంగండ్ల గ్రామ సమీపంలో 48 ఇండ్లను 241.92కోట్లు,45.65కోట్లు మౌళిక సదుపాయాల కల్పన అంచనాలతో 2018లో నిర్మించ తలపెట్టిన ఈ ఇండ్లను 2023 నాటికే పూర్తి చేశారు. కాగా గత ప్రభుత్వం.

ఈ ఇండ్లను పంచకుండా జాప్యం చేయడంతో పాటు 2023 ఎన్నికలకు ముందు మిగతావి ఎన్నికల అనంతరం ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి ఈ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలంటూ డిమాండ్ పెరుగుతూ వస్తుంది. ఇండ్లను పరిశీలించి తాగునీరు, విద్యుత్ సరఫరా లాంటి మౌళిక సదుపాయాలు కూడా వెంటనే పూర్తి చేసి నిరుపేదలకు బరోసో కల్పించేలా ఇండ్లను పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.