calender_icon.png 18 August, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారంలో అఫిడవిట్ సమర్పించాలి

18-08-2025 01:50:57 AM

ఓట్ చోరీ ఆరోపణలకు రాహుల్ గాంధీ ఆధారాలు చూపించాలి

లేదంటే దేశానికి క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్‌కుమార్

న్యూఢిల్లీ, ఆగస్టు 17:  ఎన్నికల సంఘంపై చేసిన వ్యాఖ్యలపై వెంటనే ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అఫిడవిట్ సమర్పించాలని, ఒకవేళ వారంలో  ఇవ్వకపోతే ఆ ఆరోపణలను నిరాధారంగా పరిగణిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్‌కుమార్ ప్రకటించారు. ఓట్ చోరీ అంశంపై రాహుల్ మీడియా ముఖంగా కేవలం పీపీటీ చూపించారని, ఈసీకి అది సరిపోదని, సమగ్రమైన ఆధారా లు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

లేదంటే రాహుల్  దేశానికి క్షమాపణలు చెప్పాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఈసీకి రాజకీయ పార్టీల పరంగా భేదభావాలు ఉండవని, అన్నిపార్టీలను స మానంగా చూస్తుందని స్పష్టం చేశారు. బీహార్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) పై ప్రతిపక్షాలు ఆరోపణలు తీవ్రతరం చేస్తు న్న నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో కేంద్ర ఎ న్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్‌కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఈసీ మాట్లా డుతూ.. ఎన్నికల సంఘానికి ఎలాం టి భేదభావాలు ఉండవని, అన్ని పార్టీలను సమా నంగా చూస్తుందని వివరించారు. ప్రతిపక్షా లు పనిగట్టుకుని రాజ్యాంగ సంస్థలను అవమానిస్తున్నాయని, ఆ పద్ధతి సరికాదని అభి ప్రాయపడ్డారు. ఎవరైనా ఓట్ చోరీ అన్నారంటే, అది రాజ్యాంగాన్ని అవమానించడ మేనన్నారు. దేశంలో 18 ఏళ్లు నిండి ప్రతిఒక్కరికీ ఓటు హక్కు ఉంటుందని, దేశ పౌరు లపై ఈసీ వివక్ష చూపదని వెల్లడించారు.

‘సర్’లో ఓట్లు తొలగిస్తే రాజకీయ పార్టీలు అ భ్యంతరాలు తెలుపవచ్చని పిలుపునిచ్చారు. కానీ, అబద్ధపు ప్రచారాల్ని ఈసీ ఏమాత్రం లెక్క చేయదని కొట్టిపడేశారు. ప్రతిపక్షాలు ఓటర్లను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. ఓటు చోరీకి సంబం ధించిన మో సానికి సాక్ష్యాలు చూపించాలని, లేకపోతే ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితా తయారీ, ఓటు వేయడం అనేవి రెండు వేర్వే రు అంశాలని తేల్చిచెప్పారు.

ఓట రు ఒకసారి బటన్ నొక్కిన తర్వాత మళ్లీ నొక్కే అవ కాశం ఉండదని, కాబట్టి ‘ఓటు చోరీ’ జరగడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. బీ హార్‌లో సుమారు 65 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగాయనే ఆరోపణలపై సీఈసీ స్పందిస్తూ.. 20 ఏళ్ల తర్వాత బీహార్‌లో ఓట ర్ల సర్వే జరిగిందని, ఈసీ తాజాగానే మృతు ల పేర్లను తొలగించిందని వెల్లడించారు. వం తెనల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, అనధికార కాలనీల్లో ఉండే నివాసితులకు, వారి పరిధినిబట్టి ‘0’ ఇంటి నంబరు కేటాయించామని, తద్వారా వారికి ఓటు హక్కు వచ్చింద ని తెలిపారు.

అట్టడుగు వర్గాల కు ఓటు హ క్కు  కల్పించాలనే ధ్యేయం తోనే ఈసీ ఆ ప నిచేసిందని తేల్చిచెప్పారు. ఓటర్ల గోప్యతకు సంబంధించిన సుప్రీంకోర్టు తీ ర్పును ఈసీ గౌరవిస్తుందని, అందుకే ఓటర్ల వివరాలు యంత్రం చదవగలిగే ఫార్మాట్‌లో ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఓటర్లు తమ ఈపీఐసీ నంబర్‌తో వెబ్‌సైట్‌లో జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

బీహార్ ఓటరు ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు ఉంటే, వెంటనే తెలియజేయాలన్నారు. డబుల్ ఓటింగ్, ఓటు చోరీ ఆరోపణలకు ఎన్నికల సంఘం భయపడదన్నారు. ఓటరు జాబితాలను సవరించేందు కు దేశంలో ఇప్పటివరకు 10 సార్లకు పైగా సవరణలను చేప ట్టామని, పశ్చిమ బెం గాల్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ‘సర్’ను నిర్ణీత సమయంలో చేపడతామని తెలిపారు.