calender_icon.png 18 August, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా వాటా తేలాకే ప్రాజెక్టులు కట్టాలి

18-08-2025 02:29:15 AM

  1. మా అవసరాలు తీరకుండా ప్రాజెక్టులు కట్టొద్దు
  2. రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం 
  3. సముద్రంలోకి వెళ్లే జలాలు అని చెపితే నమ్మే అమాయకులం కాదు
  4. బనకచర్లపై డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యలు

హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాం తి): గోదావరి నదిపై తాము నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నీటి వాటా తేలాకే దిగువన కొత్త ప్రాజెక్టులు కట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తమ అవసరాలు తీరకుండా ప్రాజెక్టులు కట్టొద్దని ఏపీకి సూ చించారు. సముద్రంలోకి వెళ్లే జలాలు మా త్రమే వాడుకునేందుకు బనకచర్ల ప్రాజెక్టును కడుతున్నామని చెపితే అర్థం చేసుకోలేని అమాయకులం కాదంటూ చురకలంటించారు.

ఆదివారం ఏపీలోని వైజాగ్‌లో గోదా వరి జలాలు, బనకచర్ల ప్రాజెక్టు గురించి మీడియాతో భట్టి విక్రమార్క మాట్లాడారు. నదీ జలాలతో బీడు భూములను సస్యశ్యామలం చేసుకోవడానికే ప్రత్యేక రాష్ట్రం తెచ్చు కున్నామని, గోదావరిపై తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్, దేవాదులు వంటి ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదని, ఆ ప్రాజెక్టులు పూర్తు, నీటి కేటాయింపులు జరిగిన తర్వాతే ఏపీ ప్రభుత్వం మిగులు జలాల అంశం తేల్చుకోవాలని సూ చించారు.

తమ నీటి అవసరాలు తీరకుండా, వాటా తేల్చకుండా దిగువ ప్రాజెక్టులు నిర్మా ణం జరిగితే ఆ తర్వాత కేటాయింపుల సమస్యలు ఎక్కువవుతాయని చెప్పారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్‌పై ప్రజల్లో అసంతృప్తి ఉందంటూ చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. వరద జలాలపై ఇరు రాష్ట్రాల వాటా తేలిన తర్వాతే ప్రాజెక్టులు కట్టుకోవాలని చె ప్పారు. ఇరు రాష్ట్రాల వాటాలను తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిదే అని చెప్పారు. తమకు రాజకీయ ప్రయోజనాల కంటే తమ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. 

బీజేపీకి అనుకూలంగా ఎన్నికల సంఘం

ఏపీ రాష్ట్రంలోని వైజాగ్‌లో స్లాప్ ఓట్ చో రీ క్యాంపెయిన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఓటు చోరీ జరిగిన తీరు ను ప్రజల కళ్లకు కట్టేలా రాహుల్‌గాంధీ వివరించారని చెప్పారు. బీహార్‌లో ఓట్ అధికార్ యాత్రకు రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని తెలిపారు.

అయితే ఓట్ చోరీ విషయంలో వస్తున్న ఆ రోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించకుండా బీజేపీకే అనుకూలంగా వ్యవహ రించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఓటర్లను తొలగిచండం దేశ పౌర హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు.