20-08-2025 12:44:37 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన గిరిజనులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో దర్తీ అభ జన్ జాతీయ గ్రామ్ ఉత్పక్ష అభియాన్, ఆది ఖర్మ యోగి అభియాన్ కార్యక్రమంలో భాగంగా సంబంధిత శాఖల అధికారులు, జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లతో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ ప్రధానమంత్రి జూగా పథకంలో భాగంగా ఆది కర్మ యోగి కార్యక్రమాల ద్వారా జిల్లాలోని 12 మండలాలలో గల 102 గ్రామాలలో ఉన్న గిరిజనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే సంక్షేమ పథకాలు ప్రతి గిరిజన కుటుంబానికి చేరే విధంగా బ్లాక్ స్థాయి (మండల) మాస్టర్ ట్రైనర్లు, గ్రామస్థాయి శిక్షకులు శిక్షణ ఇవ్వాలని తెలిపారు.
మిషన్ భగీరథ, గిరిజన సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య, అటవీ, విద్య, శిశు సంక్షేమ శాఖల నుండి బ్లాక్ స్థా యి ట్రైనర్లు, పంచాయితీ స్థాయి సిబ్బందిని ఎంపిక చేయాలని తెలిపారు. శిక్షణ పూర్తి అయిన అనంతరం జిల్లాలోని 12 మండలాలలో గల 102 గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి, కార్యచరణ రూపొందించాలని, ప్రతి గ్రామంలో నిర్వహించే గ్రామ సభలో గ్రామాలలో పనిచేసే ప్రతి శాఖకు సంబంధించిన సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి గ్రామ సభలో ముఖ్యంగా పంచాయితీ రాజ్, వైద్య ఆరోగ్య, గ్రామీణ అభివృద్ధి, విద్యుత్, విద్యా శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, విద్యుత్ ఎస్. ఈ. శేష రావు, పంచాయతీరాజ్ ఈ. ఈ. కృష్ణ, మిషన్ భగీరథ ఈ. ఈ. సిద్ధిక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, జిల్లా పరిషత్ ముఖ్యకార్య నిర్వహణ అధికారి లక్ష్మీనా రాయణ, పర్యటకశాఖ అధికారి అశోక్, మాస్టర్ ట్రైనర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.