calender_icon.png 4 September, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వ విధానం రైతులకు మరణ శాసనం

04-09-2025 01:54:47 AM

గార్ల, సెప్టెంబర్ 3,మహబూబాబాద్ (విజయ క్రాంతి ):- కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు జడ సత్యనారాయణ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బుధవారం మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ శారదకి అందజేశారు సంయుక్త మోర్చా నాయకులు జి.సక్రు,మాన్య, మనోహర్ సైదులు, బిక్షం తదితరులు పాల్గొన్నారు.