calender_icon.png 4 September, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఎస్సీ నోటిఫికేషన్ వేయండి

04-09-2025 01:00:13 AM

  1. సీఎం రేవంత్‌రెడ్డికి నిరుద్యోగ అభ్యర్థుల వినతి
  2. ముఖ్యమంత్రికి లేఖలు రాసిన అభ్యర్థులు

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను వెంటనే జారీ చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేశారు. గత సంవత్సరం ప్రకటించిన ఆరు వేల పోస్టులు, మోడల్, గురుకుల, టీచర్స్ ప్రమోషన్స్ ద్వారా ఏర్పడిన ఖాళీలు, ఉద్యోగ విరమణ ద్వారా ఏర్పడిన టీచర్ ఖాళీలు భర్తీ చేసేందుకు వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు పోస్ట్ కార్డు ఉత్తరాలను బుధవారం రాశారు. 

గత డీ.ఎస్సీ తర్వాత ఇప్పటికే రెండు సార్లు టెట్ పరీక్షలు నిర్వహించారని, ఈనేపథ్యంలో ఉపాద్యాయ పోస్టులు భర్తీ చేసేందకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వందలాది మంది అభ్యర్థులు లేఖలు రాశారు.   కార్యక్రమంలో తెలంగాణ రాష్ర్ట డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు హరీష్, వీరబాబు, సునీల్ , భాషా, రఘు, కిరణ్మయి,రచన, కవిత, మేఘన, రజిత, శ్రీలత, వాణి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.