calender_icon.png 4 September, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

04-09-2025 01:55:56 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 3 (విజయ క్రాంతి): గణేష్ విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా పూజించిన గణేష్ నిమజ్జనం వేడుకలను ప్రశాంతంగా, శాంతియుతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు.

మహబూబాబాద్ పట్టణంలో శోభాయాత్ర, నిజాం చెరువు లోని నిమజ్జన ఘాట్ వద్ద ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే బతుకమ్మ వేడుకలను నిర్వహించడానికి కూడా మున్నేరు వాగు వద్ద అధికారులతో కలిసి పరిశీలించారు.