06-01-2026 12:00:00 AM
గరిడేపల్లి, జనవరి 5, (విజయ క్రాంతి): మండలంలోని కల్మల్ చెరువు గ్రామపంచాయతీ సర్పంచ్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ బచ్చలకూరి శ్రీను ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గ్రామపంచా యతీ సెంటర్ లో (హైమాస్ట్ లైట్) సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి నేడు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది.
ఇటీవల వారం రోజుల క్రితం గ్రామంలో అన్ని బజార్లలో వీధిలో కొత్తగా 400 విద్యుత్ బల్బు లు వేయించడం జరిగింది అని తెలిపారు. దీంతో గ్రామంలో రాత్రి వేళలో నూతన వెలుగులతో ప్రకాశిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచా యతీ సిబ్బంది పాల్గొన్నారు.