calender_icon.png 12 January, 2026 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కానిస్టేబుల్ సేవలకు గుర్తింపు

06-01-2026 12:00:00 AM

మేడిపల్లి,జనవరి 5(విజయక్రాంతి) : మేడిపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ పొన్నం అరుణ్‌కుమార్ పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్గా తన విధులను నిబద్ధతతో నిర్వర్తిస్తున్నారు. సైబర్ నేరాల నియం త్రణలో భాగంగా, మేడిపల్లి పోలీస్‌స్టేషన్ సైబర్‌క్రైమ్ విభాగానికి సంబంధించిన సైబర్ పిటిషన్లను వేగంగా, సమర్థవంతంగా, అత్యధిక సంఖ్యలో డిస్పోజల్ చేయడంలో ఆయన విశేష కృషి చేశారు. ఈ ఉత్తమ సేవలకు గుర్తింపుగా సోమవారం డిజిపి శివధర్ రెడ్డి చేతుల మీదుగా కానిస్టేబుల్ అరుణ్‌కుమార్‌కి అప్రిసియేషన్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు.