06-07-2025 10:35:17 PM
దేవరకొండ: కొండ మల్లేపల్లి(Konda Mallepally) పట్టణంలోని ప్రధాన రహదారిలో లక్షలు వెచ్చించి ఏర్పాటుచేసిన సెంట్రల్ లైటింగ్ గత కొద్దిరోజులుగా రాత్రివేళ వెలగకపోవడంతో పట్టణ ప్రజలు, వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ లైటు వెలగకపోవడంతో పాదాచారులు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని స్థానిక ప్రజలు అంటున్నారు. కనుక సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.