calender_icon.png 7 July, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు

06-07-2025 10:39:00 PM

భక్తులతో గోదావరి నది, దేవాలయాలు కిటకిట..

మంథని (విజయక్రాంతి): మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్ మండలంలో తొలి ఏకాదశి వేడుకలు ఆదివారం ఘనంగా ప్రజలు నిర్వహించుకున్నారు. మంథని, మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆది వరహాస్వామి, గుద రంగనాయక స్వామి, సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి, గౌతమేశ్వర ఆలయం, హనుమాన్ దేవాలయాలలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే భక్తులు భారీ ఎత్తున మంథనిలోని గోదావరి నది స్నానానికి వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో మంథని ప్రాంగణమంతా రద్దీగా మారింది. వాహనాలు ఒకేసారి రావడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.

దీంతో మంథని సీఐ రాజు(CI Raju), ఎస్సై రమేష్(SI Ramesh) ఆధ్వర్యంలో వాహనాలను క్రమబద్ధీకరించారు. ఏకాదశి సందర్భంగా మహిళలు ఉపవాస దీక్షలు పాల్గొన్నారు. అలాగే ఆలయాల్లో శ్రీహరిని పూజించారు. శ్రీ ఆదివారహ స్వామి ఆలయంలో జరిగిన వేడుకల్లో కోల్ బెల్ట్ ప్రాంతంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి నలుమూలల నుండి భక్తులు భారీ ఎత్తున హాజరై పూజలు నిర్వహించారు. భక్తులు మొక్కు ప్రకారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని నాగులమ్మ వద్ద సైతం మహిళలు పాలు పోసి పూజలను నిర్వహించారు.