07-10-2025 12:04:50 AM
ఈనెల 8వ తేదీన జిల్లాలో పర్యటన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
వరద నష్టంపై కేంద్ర బృందం పర్యటన రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ,ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి ఉంటుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టం అంచనా వేయనుందన్నారు. మెదక్, నిజాంపేట, రామాయంపేట, హవేలీ ఘనపూర్ , పాపన్నపేట మండలలలో పర్యటన కొనసాగుతుందన్నారు.
ఈ బృందంలో ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారని, కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో నేరుగా మాట్లాడనుందన్నారు.