07-10-2025 12:03:33 AM
నిందితుల అరెస్టు
మెదక్, అక్టోబర్ 6 (విజయక్రాంతి):మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సన్ పల్లి గ్రామానికి చెందిన షేరి మహబూబ్ హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు మెదక్ రూరల్ సీఐ జర్జ్ తెలిపారు. మృతుడు షేరి మహబూబ్ నిందితులు కర్ర విట్టల్, కర్ర రాజమణి, కర్ర యాదగిరి, కర్ర మహేష్ మధ్య వ్యాపార పోటీ కారణంగా పాత విభేదాలు కొనసాగేవని తెలిపారు. ఈ నేపథ్యంలో 5.10.2025 న రాత్రి 8 గంటల సమయంలో ఏడుపాయల ఒకటవ బ్రిడ్జి సమీపంలో నిందితులు ఉద్దేశపూర్వకంగా మృతుడు మహబ్పూ దాడి చేసి కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.
దీంతో అతన్ని మెదక్ కు తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా లభించిన నిందితుల ఒప్పుకోలు, సాక్షుల వాంగ్మూ లాలు, వైద్య ఆధారాల ఆధారంగా నిందితులు పాత విభేదాలు, వ్యాపార పోటీ కారణంగా షేరి మహబూబ్ను హత్య చేసినట్లు నిర్ధారించినట్లు మెదక్ రూరల్ సీఐ జర్జ్ తెలిపారు. దీంతో నిందితులు కర్ర విట్టల్, కర్ర రాజమణి, కర్ర యాదగిరి, కర్ర మహేష్ లను రిమాండుకు పంపినట్లు తెలిపారు.