calender_icon.png 8 October, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కేంద్ర బృందం పర్యటన..

08-10-2025 06:41:05 PM

వరదలకు కొట్టుకుపోయిన వంతెనలు, పంట పొలాలను పరిశీలన..

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో, కేంద్ర బృందం బుధవారం స్వయంగా పర్యటించారు. ఆగస్టు 27న కురిసిన అతిభారీ వర్షాలకు పోటెత్తిన వరదలతో జరిగిన పంటనష్టం, రహదారులు ధ్వంసమైన ప్రాంతాలను కేంద్ర బృందం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(District Collector Ashish Sangwan)తో కలిసి పరిశీలంచారు. నియోజకవర్గంలోని లింగంపేట మండలం లింగంపల్లి కుర్ధు బ్రిడ్జిని, ఎల్లారెడ్డి మండలంలోని పంట పొలాలను, నాగిరెడ్డి పేట మండలంలోని మంజీరా ముంపు వరదతో దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలించారు. అనంతరం నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు ఓవర్ హెడ్ వద్ద మట్టి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. కేంద్ర బృందం సభ్యులు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో పంట నష్టం ఆస్తి నష్టానికి జరిగిన వివరాలు సేకరించారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు, కేంద్ర బృందం తెలిపారు.