calender_icon.png 8 October, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తో ఆర్ట్స్ కాలేజీ ఎంఓయు

08-10-2025 06:38:32 PM

హనుమకొండ (విజయక్రాంతి): యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ట్రైనింగ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంఓయు) చేయడం జరిగిందని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు. అనంతరం ప్రిన్సిపల్ జ్యోతి మాట్లాడుతూ ఈ ఎంఓయు ద్వారా ఆర్ట్స్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నగరంలో హనుమకొండ పోస్ట్ ఆఫీస్ లలో పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఇంటర్న్ షిప్ పొందే అవకాశం కలుగుతుందని, భారత ప్రభుత్వంతో ఆమోదింపబడ్డ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డిహెచ్ఎస్ హనుమకొండ బ్రాంచ్ ద్వారా ఈ ట్రైనింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్న్ షిప్ సర్టిఫికెట్ కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ ఎల్. జితేందర్, వైస్ ప్రిన్సిపల్ ఎస్ఎం రెహమాన్ తో పాటు ఫిజిక్స్ ఇంచార్జ్ డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ ఏ సరిత, డాక్టర్ బి సరిత, డాక్టర్ ప్రశాంత్ మరియు డాక్టర్ గిరి, ఐపిపిబి సీనియర్ మేనేజర్ ప్రమోద్ పాల్గొన్నారు.