calender_icon.png 9 August, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ చైతన్య స్కూల్ సీజ్

07-08-2025 01:01:55 AM

- మరో బ్రాంచ్‌కి విద్యార్థులు తరలింపు 

- అయోమయంలో తల్లిదండ్రులు 

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 6 (విజయ క్రాంతి):ఆలస్యంగా నైనా విద్యాశాఖ అధికారులు కళ్ళు తెరిచారు. ఎంతోకాలంగా అను మతి లేకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల పరిధిలోని చుంచుపల్లి తండాలో అనధికారికంగా నడుస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను బుధవారం విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. మూడేళ్లుగా ఎ లాంటి అనుమతులు లేకుండా విద్యాశాఖ అధికారులకు ఆమ్యాన్యాలు సమర్పిస్తూ ఆ నదికారికంగా పాఠశాల నిర్వహించారు.

బుధవారం విద్యాశాఖ శాఖా పరమైన చర్యలకు పూనుకోవటంతో ఆ పాఠశాలలో చదువుతు న్న విద్యార్థులను వాహనాల ద్వారా ఇతర బ్రాంచ్ కి తరలించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనే కమార్లు జిల్లా వ్యాప్తంగా ఇబ్బంది ముప్పడి గా అనుమతి లేని పాఠశాలలని పత్రికల్లో శీర్షికలు వెలువడిన విద్యాశాఖ అధికారులు మాత్రం కార్యాలయాన్ని దాటి బయటకు వ చ్చి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాజాగా విద్యాశాఖ అధికారి ఉద్యోగ విరమ ణ కావడం, జడ్పీ సీఈఓ కు అదన బాధ్యతలు అప్పగించిన మరుసటి రోజే అనుమతి లేని పాఠశాల పై కోరడ దులిపించడంతో వి ద్యావంతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా శ్రీ చైతన్య యాజమాన్యంతో వి ద్యాశాఖ అధికారులకు కుదిరిన లోపాయకార ఒప్పందం కారణంగా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.

గంపెడ ఆశతో చేర్పించి.... దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు 

ఆ పాఠశాలలో విద్యార్థులను చేర్పిస్తే ఐఐటి, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తామని ఇల్లు తిరిగి పిల్లలను పాఠశాలలో చేర్పించుకుంటారు. ఎంతో ఆశతో పిల్లలను ఉన్నత శిఖరాలకు పంపించాలనే ఆశతో తల్లిదండ్రులు వేలకు వేలు ఫీజులు చెల్లించి పాఠశాలలో చేర్పిస్తున్నారు.

అనుమతులు లేకుండా దొడ్డిదారిన పాఠశాలలను తెరిచి విద్యను వ్యాపారంగా మలుచుకొని ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి. విద్యార్థి తల్లిదండ్రులు సైతం పాఠశాల పర్మిషన్ ఉందా, అర్హత గల ఉపాధ్యాయులు విద్యాబోధన అందిస్తున్నారా, సరిపడ వసతులు ఉన్నాయా అనేది పరిశీలించకుండానే చేర్పిం చి మోసపోతున్నారు. 

తీరా పాఠశాల సీజ్ కావడంతో శ్రీ చైతన్య అలాంటి విద్యాసంస్థలు సైతం ఇలా మోసం చేస్తాయ అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. అర్ధాంతరంగా విద్యాశాఖ అధికారులు పాఠశాలను సీజ్ చేయటంతో విద్యార్థి తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలోపడ్డారు.