09-08-2025 03:07:22 AM
డెహ్రాడూన్, ఆగస్టు 8: ఉత్తరకాశీ జిల్లాలోని వరద ప్రభావిత గ్రామమైన ధరాలీ గ్రామం నుంచి ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఐటీబీపీ సిబ్బంది 190 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించేందుకు భారీ ఆపరేషన్లు చేపట్టారు. ఈ సహా యక చర్యల్లో ఇస్రోకు చెందిన శాటిలైట్ల సా యం తీసుకున్నారు.
వరదల్లో తప్పిపోయిన వారు తమవారితో సంప్రదింపులు జరిపేందుకు వీలుగా కమ్యూనికేషన్ వ్యవస్థలను కూడా పునరుద్ధరించారు. ఖీర్ గంగా నదికి పెద్ద ఎత్తున వరద రావడంతో ధరాలీ గ్రా మం ప్రభావితం అయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పర్యాటకులు చిక్కుకుపోయారు.