calender_icon.png 24 January, 2026 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిబ్రవరి 5న ఛలో ఢిల్లీ విజయవంతం చేయండి

24-01-2026 08:48:56 PM

ముకరంపుర,(విజయక్రాంతి): టెట్ నుండి సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులను మినహాయింపు ఇవ్వాలని, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ  మొదలైన డిమాండ్ ల తో ఎ ఐ జాక్టో ఫిబ్రవరి 5 న తలపెట్టిన  ఢిల్లీ "మార్చ్ టు పార్లమెంట్ "ను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా ప్రైమరీ టీచర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి వైయస్ శర్మ, తెలంగాణ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె మల్లికార్జునరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శారద, ఏఐపిటిఎఫ్ జాతీయ కౌన్సిలర్లు డి. నగేష్, పి.విక్రమ్ బాబులు ఒక ప్రకటనలో కోరారు. అన్ని జిల్లాల నుంచి భారీ స్థాయిలో ఉపాద్యాయులు పాల్గొని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే మార్చ్ టు పార్లమెంట్  ఆందోళన కార్యక్రమన్ని విజయవంతం చేయాలని కోరారు.