24-01-2026 08:51:41 PM
కంగ్టి,(విజయక్రాంతి): మండలంలోని తడ్కల్ లోని మూడవ అంగన్వాడీ కేంద్రం లో శనివారం ఎలిచలసుగుణ మల్లారెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు ప్రభుత్వం అందించిన రెండు జతల దుస్తువులు పంపిణి చేశారు. అంగన్వాడీ కేంద్రాలలో ఫ్రీ ప్రైమరి విద్యాతో పాటు అనేక సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు. పిల్లలతో పాటు గర్భిణీలకు, బాలింతలకు అనేక పోషక పదార్థాలను అందించాలని అన్నారు. అనంతరం పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సమీర్,టీచర్లు లలిత, ప్రేమల,వార్డుసభ్యులు భూమేష్, డేవిడ్, బాబూసాబ్, తదితరులు పాల్గొన్నారు.