calender_icon.png 5 August, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చండీయాగం అవాస్తవం

05-08-2025 12:43:09 AM

  1. కేసీఆర్ చండీయాగం చేస్తున్నారంటూ ప్రచారం 
  2. ఖండిస్తూ.. ప్రకటన విడుదల 

హైదరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో చండీయాగం నిర్వహిస్తున్నారని చేస్తున్న దుష్ర్పచారాన్ని ఖండిస్తూ.. కేసీఆర్ కార్యాలయ వర్గాలు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశాయి. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో చండీయాగం అంటూ ప్రముఖ టీవీ చానళ్లు, పత్రికలు ఈ దుష్ర్పచారాన్ని కొనసాగించడం బాధ్యతారాహిత్యమ న్నారు. అసత్యప్రచారాలను వెంటనే నిలిపివేయాలని కేసీఆర్ కార్యాలయ వర్గాలు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి.