calender_icon.png 5 August, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతువేదికలో నూతన రేషన్ కార్డుల పంపిణీ

05-08-2025 12:42:39 AM

సిర్గాపూర్, ఆగస్టు 4: సిర్గాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం నాడు మండల పరిధిలోని అన్ని గ్రామాలకు సంబంధించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కులను ఎమ్మెల్యే పట్లోళ్ళ సంజీవ్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ...

గత 10 సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డులు లేక ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కున్నారని, ఏది జరగాలన్నా, ఏది కావాలన్నా రేషన్ కార్డు అవసరమన్నారు. సిర్గాపూర్ మండలానికి 3వేల రేషన్ కార్డుల్లో పేర్లను చేర్చడం జరిగిందని, కొత్తరేషన్ కార్డులు 493 జారీ చేయడం జరిగిందన్నారు.

అలాగే 367 ఇందిరమ్మ ఇండ్లు మంజూరవ్వగా 170 బెస్మెంట్ వరకు పూర్తిచేసుకొని బిల్లులు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల తహసీల్దార్ హేమంత్ కుమార్, ఎంపీడీవో, హౌజింగ్ డిఈ, ప్రభుత్వాధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మనీష్ పాటిల్, యాదవ్ రెడ్డి, శ్రీనివాస్ రావ్, స్వప్న, రవీందర్ పాటిల్, తుకారాం, ముజమ్మిల్ పాల్గొన్నారు.