08-08-2025 10:19:56 PM
నల్గొండ క్రైమ్: రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్ నుండి నల్లగొండకి ద్విచక్ర వాహనంపై వస్తున్న వారిని శుక్రవారం డీసీఎం ఢీకొట్టగా ఒక వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నల్గొండ పట్టణంలోని సాగర్ రోడ్ లో ముత్యాలమ్మ కాలనీకి చెందిన గంట కంపు నాగరాజు(26) అతని తమ్ముడు గంట కంపు మణికంఠ నల్గొండ మండలంలోని గిరకబావి గూడెం గ్రామ శివారుకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న డీసీఎం డ్రైవర్ అతివేగంగా జాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా బైకు నడుపుతున్న గంట కంపు నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. అతని తమ్ముడు మణికంఠ తీవ్రంగా గాయపడ్డాడు. మృతుని తల్లి గంటకంపు అరుణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు నలగొండ రూరల్ ఎస్సై సైదా బాబు తెలియజేశారు.