calender_icon.png 9 August, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్‌లో ఓట్ల తొలగింపుపై సీపీఎం ఆందోళన

08-08-2025 10:46:46 PM

హనుమకొండ జిల్లా కార్యదర్శి గాద ప్రభాకర్ రెడ్డి..

హన్మకొండ టౌన్ (విజయక్రాంతి): బీహార్‌లో ఎన్నికల సంఘం ఓట్ల తొలగింపుపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఎం హన్మకొండ జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్ రెడ్డి(CPM District Secretary Gade Prabhakar Reddy) డిమాండ్‌ చేశారు. శుక్రవారం అంబేద్కర్ సెంటర్ లో సీపీఎం హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, బీహార్ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఎన్నికల కమిషన్ 65లక్షల ఓట్లు జాబితాను తొలగించారన్నారు. దేశంలో ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ బీహార్‌లో 65 లక్షల ఓట్ల తొలగింపునకు కుట్ర పన్నుతున్న బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రజలు వ్యతిరేకించాలని అన్నారు.

ఆ రాష్ట్రంలో బీజేపీ కూటమి ఓడిపోయే అవకాశం ఉన్నందున ఓటర్లను తగ్గించాలని చూస్తోందన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. ఓటమి భయంతోనే బీజేపీ ఓట్లను తొలగిస్తుందని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ అంటే ప్రజాస్వామ్య సంస్థ, స్వాతంత్రంగా పని చేయాల్సిన సంస్థ కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని అన్నారు. ఇప్పటికైనా తోలగించిన ఓట్లను మళ్ళీ తిరిగి ఓటు హక్కు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చుక్కయ్య, రాగుల రమేష్, వంకుడొతు వీరన్న, జి. రాములు, దొగ్గేలా తిరుపతి, లింగన్న, ఎల్.దీపా, భాను నాయక్, నాయకులు ఒరుగంటి సాంబయ్య, నోముల కిషోర్, రమ, కారు ఉపేందర్, మంద మల్లేశం, యకయ్య, శ్రీకాంత్, కళ్యాణ్, సుదర్శన్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.