calender_icon.png 9 August, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

08-08-2025 10:52:49 PM

వైద్య ఆరోగ్యశాఖ విస్తృత ప్రచారం..

హన్మకొండ (విజయక్రాంతి): సీజనల్ వ్యాధులు ముఖ్యంగా దోమకాటు వలన వ్యాపించే మలేరియా, డెంగ్యూ నివారణలో భాగంగా హనుమకొండ ఆరోగ్యశాఖ ద్వారా ప్రజలలో అవగాహన కలిగించేందుకు వినూత్నమైన ప్రయత్నంలో భాగంగా దోమలు పుట్టకుండా, పెరగకుండా, కుట్టకుండా తీసుకోవాలసిన చర్యలను ప్రత్యక్షంగా ఈరోజు లష్కర్ సింగారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రదర్శించడం జరిగిందని హనుమకొండ డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య(DMHO Dr. Appaiah) తెలిపారు. ఇందులో భాగంగా దోమల ఆవాసాలైన టైర్లు, కొబ్బరి బోండాలు, వాడి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులు, పూల కుండీలు, ప్లాస్టిక్ వస్తువులతో పాటుగా దోమలు కుట్టకుండా తీసుకునే చర్యలైన దోమతెర వాడుతు వ్యక్తి ప్రశాంతగా నిద్రిస్తున్న విధానాన్ని ప్రదర్శించడం జరిగింది.

అలాగే అవగాహన సందేశాలతో కూడిన స్టాండి ని ప్రదర్శించడం జరిగింది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని తప్పనిసరిగా దోమల నివారణ చర్యలు పాటించి, దోమల నియంత్రణ చర్యలో భాగస్వాములు అవుతూ  ఆరోగ్యాన్ని కాపాడుకుందాం తద్వారా ఆరోగ్యపరమైన ఖర్చులను తగ్గించుకుందాం ప్రభుత్వానికి సహకరిద్దాము అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అడిష్ నల్ డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్.టి. మదన్ మోహన్ రావు, వైధ్యాధికారి డాక్టర్ హైదర్, జిల్లా మాస్ మీడియా అధికారి వి .అశోక్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ బాబు, విప్లవ్ కుమార్, మరియా థామస్,  శ్రీనివాస్, ఏ‌ఎన్‌ఎం లు, ఆశా కార్యకర్త లు పాల్గొన్నారు.

డ్రై డే, జ్వర సర్వే పర్యవేక్షణ

డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య, డాక్టర్ టి. మదన్ మోహన్ రావు లు గోపాల్ పూర్ ప్రాంతంలోని వేంకటేశ్వర కాలనీ లో ఆరోగ్య సిబ్బంది  డ్రై డే తో పాటు ఇంటింటి జ్వర సర్వే, ర్యాపిడ్ టెస్ట్ లు  నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పరిశీలించారు.  ఈ సంధర్భంగా గృహాలను సందర్శించి వారికి తగిన సూచనలు చేయడం జరిగింది. ప్రజలు తమ ఇంటి చుట్టూ, కాంపౌండ్ ల ప్రక్కన పెరిగిన గడ్డి, చిన్న చిన్న పొదలను తొలగించి పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవడం తమ వంతు బాధ్యతగా భావించాలన్నారు. ప్రజలు సహకరించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.