calender_icon.png 9 August, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోడు భూముల రైతుల ఆందోళనకు బీజేపీ మద్దతు

08-08-2025 10:33:06 PM

బీజేవైఎం నాయకులు ధార రవి సాగర్..

మందమర్రి (విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం దింద గ్రామానికి చెందిన 50 మంది పోడు రైతులు తమ పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనలకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇచ్చి పోడు భూముల సమస్య పరిష్కారం అయ్యేవరకు వారికి అండగా నిలుస్తుందని బీజేవైఎం రాష్ట్ర నాయకులు దార రవి సాగర్ స్పష్టం చేశారు. పోడుభూముల సమస్యను పరిష్కరించాలని కోరుతూ రైతులు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం మండలానికి చేరుకోగా పాదయాత్రకు స్వాగతం పలికి వారికి సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ, ఎన్నో ఎండ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా అటవీ శాఖ అధికారులు తమని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయం ప్రజా భవన్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తాడో పేడో తేల్చుకునేందుకు పాదయాత్ర చేపట్టామని, సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తామని పోడు రైతులు స్పష్టం చేశారు. పాదయాత్ర చేపట్టిన రైతులకు బీజేపీ నాయకులు అందుగుల శ్రీనివాస్ సహకారంతో భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చెన్నూర్ అసెంబ్లీ కన్వీనర్ అక్కల రమేష్ తదితరులు పాల్గొన్నారు.