08-08-2025 10:44:05 PM
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను పరిశీలించిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి..
చిన్న చింతకుంట: నిర్మాణపనులు నాణ్యతగా చేయాలని ఎక్కడ రాజీ పడకూడదని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి(MLA Madhusudan Reddy) స్పష్టం చేశారు. సీసీ కుంట మండల పరిధిలోని కురుమూర్తి దేవస్థానం దగ్గర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో ఆ పండ్లను దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రత్యేకంగా శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రభుత్వం పక్క ప్రణాళికలతో పనులను చేసుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు. ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్న ప్రతి సమస్యకు పరిష్కార రూపం దాల్చుతూ ప్రజల మండల పొందుతుందని తెలియజేశారు. వేలాదిగా తరలివచ్చి దైవ దర్శనం చేసుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ఉద్దేశంతో ప్రతి విషయంలోనూ పారదర్శంగా పనులు చేస్తున్నామని తెలిపారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిసి కుంట దేవరకద్ర నియోజకవర్గ నేతలు తదితరులు ఉన్నారు.