calender_icon.png 9 August, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూమ్ ల పేరుతో మోసం

08-08-2025 10:28:24 PM

30 మంది నుంచి రూ.లక్ష చొప్పున వసూల్..

నాగరాజు ఇంటిముందు బాధితుల ఆందోళన..

మేడిపల్లి: అమాయక ప్రజలను మోసం చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో జరిగింది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివసించే వెలిశెట్టి నాగరాజు డబుల్ బెడ్రూం కాంట్రాక్టర్ను అని, పొలిటికల్ లీడర్లు తెలుసని నమ్మబలికి ప్రతాపసింగారం డబుల్ బెడ్రూమ్లలో ఇండ్లు ఇప్పిస్తానని 2, 3 సంవత్సరాల క్రితం ఒక్కొక్కరి నుండి రూ.లక్ష చొప్పున సుమారు 30 మంది దగ్గర వసూలు చేశాడు. అప్పటి నుండి నాగరాజు బాధితులకు మాయమాటలు చెబుతూ అప్పుడు, ఇప్పుడు ఇప్పిస్తానని కాలయాపన చేస్తూ వస్తున్నాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధిత కుటుంబాలు తమ డబ్బు తిరిగి ఇవ్వమని కోరడంతో నాగరాజు కనిపించకుండా తిరుగుతున్నాడు. శుక్రవారం నాడు బాధితులు నాగరాజు ఇంటివద్ద ఆందోళన చేశారు.