08-08-2025 10:24:33 PM
గరిడేపల్లి (విజయక్రాంతి): మండల కేంద్రమైన గరిడేపల్లిలో శ్రవణ మాసం శుక్రవారం కావడంతో మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించుకున్నారు. స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం(Ayyappa Swamy Temple)లో గుండాలమ్మ దేవాలయంలో సామూహికంగా వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించగా, అనేకమంది మహిళలు తమ గృహాలలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీదేవి పూజను ఘనంగా నిర్వహించారు. వరలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన చేసి వివిధ రకాల వంటకాలను తయారుచేసి నైవేద్యం పెట్టారు. వరలక్ష్మి వ్రతం కావటంతో గరిడేపల్లిలోని దేవాలయాలు మహిళా భక్తులతో నిండిపోయాయి. వరలక్ష్మి వ్రతం అనంతరం మహిళలకు ఒకరినొకరు వాయినాలు అందించుకొని ఆశీస్సులు పొందారు.