calender_icon.png 9 August, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమత పాఠశాలలో ఘనంగా వరలక్ష్మి వ్రతం పూజలు

08-08-2025 10:22:20 PM

కొండాపూర్: వరలక్ష్మి వ్రతం పురస్కరించుకొని కొండాపూర్ మండల(Kondapur Mandal) పరిధిలోని మనసాన్పల్లి గ్రామ సమత పాఠశాలలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి విద్యార్థులు మాతృమూర్తుల సమక్షంలో సామూహికంగా అత్యంత వైభవంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా పెంటా రెడ్డి, ముఖ్యఅతిథిగా గాయత్రి హాజరై వ్రత వైభవాన్ని విద్యార్థులకు విద్యార్థిని తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భంగా దావల్ రెడ్డి మాట్లాడుతూ... అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సమత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి. దావల్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు.