08-08-2025 10:30:10 PM
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి..
నల్లగొండ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మహిళ సోదరీమణులకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Telangana Legislative Council Chairman Gutha Sukender Reddy) రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్న చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని ఆయన చెప్పారు. రాఖీ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన వివరించారు.