03-10-2025 07:09:57 PM
తాండూరు,(విజయక్రాంతి): వ్యక్తి నిర్మాణం ద్వారానే ఉద్దేశ నిర్మాణం సాధ్యమవుతుందని.. ప్రతి ఒక్కరూ దైవభక్తితో పాటు దేశభక్తి కలిగి ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మండల కార్యనిర్వహణాధికారి సంతోష్ కుమార్ అన్నారు. రాష్ట్రీయ స్వయంతి స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యాలాల మండలం రాస్నం గ్రామంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవం ఘనంగా జరిగింది. సంఘ వ్యవస్థాపకులు ఎడిగేవార్, గోల్వాల్కర్, భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సంతోష్ కుమార్, యాలాల మండల కార్యవాహ శివరాజ్ మాట్లాడుతూ... 1925 వ సంవత్సరం ఉగాది రోజున హిందువుల సంఘటితం కావాలని ఉద్దేశంతో కేవలం 25 మంది కార్యకర్తలతో హెడ్గేవార్ స్థాపించడం జరిగిందని నేడు ప్రపంచవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ శాఖలు కోట్లాదిమంది కార్యకర్తలతో గ్రామ గ్రామాన నడుస్తున్నాయని అన్నారు. దేశం ప్రజలందరికీ ఒకే శాసనం ,అంటరానితనం లేకుండా ప్రజలంతా సమైక్యంగా ఉండాలన్నది ఆర్ఎస్ఎస్ లక్ష్యం అని అన్నారు.