calender_icon.png 16 September, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్ అక్రమాలతోనే రైతులకు రుణమాఫీ జరగలేదు

16-09-2025 07:41:28 PM

ఎఫ్.ఎస్.సీ.ఎస్ డైరెక్టర్ పదవికి చందుపట్ల ధర్మారెడ్డి రాజీనామా 

ఘట్ కేసర్ (విజయక్రాంతి): ఘట్ కేసర్ రైతు సేవా సహకార సంఘం గత మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్ అవినీతి, అక్రమాలకు పాల్పడడంతో కేవలం ఘట్ కేసర్ సొసైటీలో మాత్రమే రైతు రుణమాఫీ జరగలేదని రైతు సొసైటీ డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలకమండలి అలసత్వంతో కూడిన నిర్లక్ష్యం వల్ల గత మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్ అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. ఎఫ్.ఎస్.సీ.ఎస్ లో రుణాలు పొందిన 1189 మంది రైతులకు రుణమాఫీ అమలు కాలేదని భవిస్తూ, అందుకు నైతిక బాధ్యత వహిస్తున్న డైరెక్టర్ పదవికి నేడు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వానికి పంపాల్సిన అర్హులైన రైతుల రుణమాఫీ జాబితాను గత మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్ ఆలస్యంగా పంపారని, అందులో కూడా రైతుల పేర్లని, రుణాలు తీసుకున్న రైతుల అమౌంట్ ఎక్కువ తక్కువగా చూపారని, రుణమాఫీ లీస్టులో చాలా రకాల తప్పుగా జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ జరిగిందన్నారు. 

ఈ క్రమంలోనే ఇంటర్నల్ ఆడిట్ జరిపిన సహకార, వ్యవసాయ అధికారులకు 43 మంది రుణమాఫీకి అర్హులు కాని పేర్లు గుర్తించారని, దీంతో రుణమాఫీ లీస్టులో నుంచి 43 మంది పేర్లు తొలగించి మరోసారి పంపాలని వ్యవసాయ అధికారులు సూచించినట్లు తెలిపారు. ఆపేర్లని తీసివేస్తే తన అవినీతి ఎక్కడ బయట పడుతుందోనని భయపడ్డ గత మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్ ప్రభుత్వానికి రుణమాఫీ లీస్టు పంపడంలో కుంటిసాకులు చూపుతూ ఆలస్యం చేశాడని తెలిపారు. గత మేనేజింగ్ డైరెక్టర్  చర్యలతోనే 1189  మంది రుణమాఫీ పొందలేకపోయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘట్కేసర్ ఎఫ్.ఎస్.సీ.ఎస్. బ్యాంకులో జరిగిన అవినీతి, అక్రమాలపై జ్యుడీషియల్ లేదా విజిలెన్స్ విచారణ జరిపితే అవినీతి పరులకు కొమ్ముకాస్తున్న వారి భండారం బట్టబయలవుతుందని అక్రమాలకు పాల్పడిన గత మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని రుణమాఫీ బాధిత రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.