calender_icon.png 16 September, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల ప్రగతి ప్రశంసనీయం

16-09-2025 07:42:02 PM

మందమర్రి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రగతి ప్రశంస నీయమని విద్యార్థులు చదువుల్లో చక్కటి ప్రతిభ కనబరిచి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని  తెలంగాణ మోడల్ స్కూల్స్  అదనపు సంచాలకులు శ్రీనివాస చారి కోరారు. మంగళవారం జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్యతో కలిసి పాఠశాలను సందర్శించి విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని లైబ్రరీ, సైన్స్ లాబ్స్ ను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కెహెచ్ఏఎన్ అకాడమీ ఫిజిక్స్ చాలా చక్కగా నిర్వహిస్తు న్నారని, వీటికి సంబంధించిన రికార్డు లను పరిశీలించడం తో పాఠశాల వాతావరణం, విద్యార్థుల ప్రగతి పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో ప్రగతిని పెంపొందించేందుకు ఉపాధ్యాయులకు అవసర మైన సూచనలు అందజేశారు.