calender_icon.png 29 October, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవగాహనతో మార్పు మొదలవుతుంది

29-10-2025 01:38:03 AM

  1. స్ట్రోక్‌పై అత్యవసర స్పందనతో ప్రాణానికి రక్షణ
  2. డాక్టర్ రోహిత్‌కుమార్, న్యూరాలజిస్టు మాల్లారెడ్డి నారాయణ మల్లీస్పెషాలిటీ ఆస్పత్రి

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి): అవగాహనతో మార్పు మొదలవుతుందని, స్ట్రోక్‌పై అత్యవసర స్పందనతో ప్రాణానికి రక్షణ పొందవచ్చునని డాక్టర్ రోహిత్‌కుమార్, కన్సల్టెంట్ న్యూ రాలజిస్టు, మాల్లారెడ్డి నారాయణ మల్లీస్పెషాలిటీ ఆస్పత్రి, హైదరాబాద్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. “ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ ఇప్పటికీ మరణాలు, దీర్ఘకాలిక వికలాంగతకు ప్రధాన కారణంగా ఉంది.

తాజా గణాంకాల ప్రకారం, ప్రతి సంవత్సరం సుమారు 1.2 కోట్ల మంది స్ట్రోక్కు గురవుతున్నారు. వీరి లో దాదాపు సగం మంది జీవి తాంతం ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. ఆక స్మికంగా సమతుల్యత కోల్పోవ డం, చూపు మసకబారడం లేదా ఒక్కసారిగా కనిపించకపోవడం, ముఖం ఒకవైపు జారిపోవడం, ఒక చేయి బలహీనపడటం, మాటలు తడబడటం లేదా స్పష్టంగా రాకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే అత్యవసర వైద్య సహాయం కోసం వైద్యులను సంప్రదించాలి. భారతదేశంలో స్ట్రోక్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.

యువతలో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. సమయానికి స్పందించడం, స్ట్రోక్కు సిద్ధమైన ఆసు పత్రులను చేరుకోవడం, నిరంతర ఆరోగ్యపరమైన శ్రద్ధతో నివారణ చర్యలు చేపట్టడం అవసరం. స్ట్రోక్‌లలో ఎక్కువ భాగం నివారించదగినవే.

ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిం చడం, రక్తపోటు మరి యు మధుమేహం నియంత్రణలో ఉంచడం, వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకోవడం, ధూమపానం, మద్యపానం నుండి దూరంగా ఉండడం ముఖ్యమైనవి. మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పి టల్‌లో మేము నివారణ, వేగవంతమైన స్పందన, ఆధునిక పునరావాసంపై దృష్టి సారించి, ప్రతి రోగికి నిపుణుల సంరక్షణను అందిస్తున్నాం” అని చెప్పారు. ఆసుపత్రిలో 24 గంటలు స్ట్రోక్ రెస్పాన్స్ యూనిట్లు, అత్యవసర సేవల నుండి పునరావాసం వరకు పూర్తి చికిత్స అందుబాటులో ఉంటుందని చెప్పారు.