calender_icon.png 29 October, 2025 | 10:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ అధికారులదే కీలక పాత్ర

29-10-2025 01:38:32 AM

-జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్

-ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు రెండో విడత శిక్షణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రక్రియలో ప్రిసైడింగ్ అధికారుల పీఓ పాత్ర అత్యంత కీలక మని, వారు పూర్తి అవగాహనతో, పారదర్శకంగా వ్యవహరించి ఎన్నికలను సజావు గా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఎన్నికల విధులను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని, ఎలాంటి పొర పాట్లకు తావివ్వరాదని ఆయన సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

మంగళవారం షేక్‌పేటలోని జి.నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశా లలో పీఓలు, సహాయ ప్రిసైడింగ్ అధికారుల ఏపీఓ కోసం రెండో విడత శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు సెషన్లుగా జరిగిన ఈ శిక్షణకు సుమారు 500 మంది అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరైన ఎన్నికల పోలీస్ పరిశీలకులు ఓం ప్రకాశ్ త్రిపాఠి, వ్యయ పరిశీలకులు సంజీవ్ కుమార్ లాల్ శిక్షణ జరుగుతున్న తీరును, అధికారుల సన్నద్ధతను పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ కర్ణన్, అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌తో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వారి విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు.

శిక్షణలో ఏమైనా సందేహాలుంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని,  పోలింగ్ ముందు రోజు నుంచే ఒక చెక్‌లిస్ట్ తయారు చేసుకుని ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి అని సూచించారు. జూబ్లీహిల్స్ బరిలో నోటాతో కలిపి మొత్తం 59 మంది అభ్యర్థులు ఉన్నందున, ప్రతి పోలింగ్ కేం ద్రంలో నాలుగు బ్యాలెట్ యూనిట్లను ఒక కంట్రోల్ యూనిట్, ఒక వీవీప్యాట్‌కు అనుసంధానం చేయాల్సి ఉంటుందని మాస్టర్ టైనర్లు వివరించారు. ఈవీఎంల అనుసంధానం, మాక్ పోలింగ్ నిర్వహణ, ఓటింగ్ ప్రక్రియపై అధికారులకు ప్రత్యక్షంగా శిక్షణ ఇచ్చారు.

పోలింగ్ కేంద్రంలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకురావాలని కమిషనర్ సూచించారు. ఎన్నికల పరిశీలకులు ఓం ప్రకాశ్ త్రిపాఠి, సంజీవ్ కుమార్ లాల్ మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ప్రతి అధికారి నిక్కచ్చిగా పాటించాలన్నారు. కార్యక్రమంలో శిక్షణ కార్యక్రమాల బాధ్యులు సునంద, మమత తదితరులు పాల్గొన్నారు.