29-10-2025 01:36:52 AM
జూబ్లీహిల్స్‌లో నాయకుల ప్రచారం
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి తరఫున మంగళవారం బోరబండ డివిజన్ పరిధిలోని బూత్ నంబర్లు 376, 377, 378 ప్రాంతాల్లో నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్, నాగోల్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు పంగ శ్రీకాంత్, నాయకులు నూకల పద్మరెడ్డి, కాలంశెట్టి లయ, నరేష్ యాదవ్, సంతోష్, నర్సింగ్, మనోజ్ పాల్గొన్నారు.
ప్రచార బృందం ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమై, కేంద్రంలో ప్రజాహిత పాలనను అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రం లో కూడా అభివృద్ధి కొనసాగాలంటే బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రచారం సందర్భంగా బిజెపి కార్యకర్తలు మార్పు రావాలని బిజెపి గెలవాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. స్థానిక ప్రజలు కూడా ఉత్సాహంగా స్పందించి బిజెపి అభ్యర్థికి తమ మద్దతు తెలుపారు. కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులతో బిజెపి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే విధానాలను కొనసాగిస్తూనే ఉంటుంది. ప్రతి బూత్ స్థాయిలో బలమైన కేడర్తో బిజెపి విజయం ఖాయమని తెలిపారు.