30-08-2025 10:42:19 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలో వరుసగా కురిసిన అధిక వర్షాల వలన బాన్సువాడ పట్టణంలో పాక్షికంగా దెబ్బతిన్న ఇంటిని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధిక వర్షాలతో పాక్షికంగా మరియు పూర్తిగా దెబ్బతిన్న ఇండ్లకు ప్రభుత్వం నష్ట పరిహారం అందిస్తుందని, దెబ్బతిన్న ఇండ్లను అధికారులతో సర్వే నిర్వహించి గుర్తిస్తున్నామని తెలిపారు. అలాగే దెబ్బతిన్న రోడ్లు, విధ్యుత్ తదితర పనుల పునరుద్దరణ పనులు చేపట్టామని తెలిపారు.