30-08-2025 10:38:06 PM
బాన్సువాడ(విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కామారెడ్డి, బాన్సువాడ డివిజన్లలో వరద సహాయక చర్యల్లో విశేష సేవలందించిన ఎస్ఈర్ఎఫ్ (17వ బెటాలియన్) బృందాన్ని బాన్సువాడ శనివారం సబ్-కలెక్టర్ కిరణ్మయి అభినందించారు. ప్రాణాలకు తెగించి వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడంలో ఎస్ఆర్ఎఫ్ చూపిన ధైర్య సాహసాలు, నిబద్ధత అమోఘమని ఆమె ప్రశంసించారు. రెస్క్యూ ఆపరేషన్లలో వారి కృషి అభినందనీయమని కొనియాడారు.