calender_icon.png 31 August, 2025 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోనాపూర్ సంగోజీపేట గ్రామాల రహదారిపై వరద ఉధృతికి కల్వర్టు ధ్వంసం

30-08-2025 10:29:55 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గంలోని కోనాపూర్ సంగోజీపేట రహదారిపై వరద ఉధృతికి బ్రిడ్జి కల్వర్టు దెబ్బతింది. పంట పొలాలు నీటమునిగి పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి శనివారం పరిశీలించి, బాధిత రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.