calender_icon.png 31 August, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డోర్నకల్ నూతన సీఐగా చంద్రమౌళి నియామకం

30-08-2025 10:24:56 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చంద్రమౌళిని నియమిస్తూ జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఆయన శనివారం బాధ్యతలు చేపట్టారు. స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించిన చంద్రమౌళి తాజాగా శాంతి భద్రతల విభాగానికి బదిలీ కావడం విశేషం. ఈ సందర్భంగా సిఐ చంద్రమౌళి మాట్లాడుతూ డోర్నకల్ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ సమస్యలను ఏలాంటి భయాందోళన చెందకుండా నేరుగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, ప్రజల సమస్యలకు చట్టం ద్వారా పరిష్కారం చూపిస్తామని సీఐ తెలిపారు. డోర్నకల్ సర్కిల్ పరిధిలో గంజాయి, అక్రమ ఇసుక రవాణా, బెల్లం, గుడుంబా తదితర అక్రమ దందాలను ప్రజల సహకారంతో నిర్మూలిస్తామని సిఐ వెల్లడించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిఐని డోర్నకల్ సర్కిల్ పరిధిలోని సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.