30-08-2025 10:50:45 PM
రాజాపూర్: టీఎంఎల్ మేళాతో విద్యార్థులకు మరింత ఉత్తమమైన బోధన అందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా విద్యాధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రాథమిక పాఠశాలల మండల స్థాయి టీఎంఎల్ మేళాకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా పాఠశాల ఆవరణలో వివిధ గ్రామాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలను తిలకించి అభినందించారు.
అనంతరం వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన టిఎంఎల్ స్టాళ్లను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. చదువుల్లో వెనకబడిన పాలమూరు జిల్లాను రాష్ట్రస్థాయిలో నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడు మీద ఉందన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు ఉపాధ్యాయులు టిఎల్ఎంను వాడాలని తద్వారా బోధన అర్థవంతంగా విద్యార్థికి కేంద్రీకృతంగా ఉంటుందని తెలిపారు. టీఎంఎల్ మేళాలో ఉత్తమఖన ఉత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాలలను జిల్లా స్థాయి కి ఎంపిక చేస్తామని తెలిపారు.